పాతిక సంవత్సరాల నవ జవ్వని ..
తనలోని విషయ పరిజ్ఞానంతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న సమ్మోహిని...
అండపిండ బ్రహ్మాడం లో దేనిగురించి ఐనా అడగొచ్చు..
కనురెప్ప పాటు లో వెయ్యోవంతు సమయం లో సమాచారం పొందొచ్చు
తాను పరిశోధకుల పాలిట కామధేనువు..
విషయ జిజ్ఞాసుల మీమాంసాలు తీర్చే కల్పతరువు ...
గురువులని మించిన గుగ్గురువైంది ఎందరో ఏకలవ్య శిష్యులకు ..
విడదీయరాని మిత్రురాలయ్యింది ఇంట్లో వుండే అన్ని తరాలకు..
పాలుత్రాగే పసి పాపకైనా , పక్కమించి లేవలేని పండుముసలికైనా అంతర్జాలంలో మొదటి అడుగు గూగుల్..
ప్రస్తుతం ఒక్కరోజు గూగుల్ లేదు అంటే శతకోటి గుండెలు గుబేల్ ..
సమాంతరంగా మానవ మేధస్సుకి చేస్తోంది బస్తీమే సవాల్ ..
*గూగుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు* ...💐🎊🎉🎂
*Happy 25th Birthday Google*. 💐🎉🎊. .. # *KrishnaCN*.
No comments:
Post a Comment