Sunday, January 14, 2024

Google Birthday

 పాతిక సంవత్సరాల నవ జవ్వని .. 

తనలోని విషయ పరిజ్ఞానంతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకున్న  సమ్మోహిని... 

అండపిండ బ్రహ్మాడం లో దేనిగురించి ఐనా అడగొచ్చు.. 

కనురెప్ప పాటు లో వెయ్యోవంతు సమయం లో సమాచారం పొందొచ్చు 

 తాను పరిశోధకుల పాలిట కామధేనువు.. 

విషయ జిజ్ఞాసుల మీమాంసాలు తీర్చే కల్పతరువు ... 

గురువులని మించిన గుగ్గురువైంది ఎందరో ఏకలవ్య శిష్యులకు .. 

విడదీయరాని మిత్రురాలయ్యింది ఇంట్లో వుండే అన్ని తరాలకు.. 

పాలుత్రాగే పసి పాపకైనా , పక్కమించి  లేవలేని పండుముసలికైనా అంతర్జాలంలో మొదటి అడుగు గూగుల్.. 

ప్రస్తుతం ఒక్కరోజు గూగుల్ లేదు అంటే  శతకోటి గుండెలు గుబేల్ .. 

సమాంతరంగా మానవ మేధస్సుకి చేస్తోంది బస్తీమే సవాల్ ..

*గూగుల్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు* ...💐🎊🎉🎂

*Happy 25th Birthday Google*. 💐🎉🎊. .. # *KrishnaCN*.

Thursday, March 28, 2019

Oh my chum..., I know, A day will come..
When , you will come..
Let, what may come..
Your absence makes my thoughts  set aflame..
Awaiting you,making me a candelabrum..
Count me for Any inhibitions to overcome..
Join me, before your image in my brain needs an exhume..
Your fragrance makes my heart chime..
Your company pumps my
Oxytocin enzyme..
అలిసిపోయేంత దూరం ప్రయాణం చేసినా..అడుగు మాత్రమైనా దూరమవ్వలేదంది మనసు..
కలిసినంత సేపు మోము తిప్పుకున్నా..కనుచూపుమేర దాటలేదంది మనసు..
మౌన బాష్యాల కావ్యాలు మదిలో ఎన్ని వ్రాసిన..మాట పెదవి దాటలేదంది మనసు..
నీ సందేశాల జడివానలో ఒకనాడు తడిసినా..కన్నీరు కార్చేందుకు చుక్క నీరులేక బీడుబారానంది మనసు..
చీకటి నా నేస్తం ఐయ్యిందా ...నీ నవ్వే చిరుదీపం అవుతుందా...
అమావాస్య పక్షమంత పరుచుకుందా.. నువ్వెంటవస్తే వెన్నెల ఉదయిస్తుందా...
నీ బంధాలన్ని తెంచుకోమనలేదు...నాతో అనుబంధం పంచుకోమన్నాను..
బంధాలను పసిపాపలా పదిలంగా చూసుకోగల చేతులు..
నువ్వు కనిపిస్తే సంతోషపడే నా పసి హృదయాన్ని ఎందుకు నలిపేస్తావు..
కళ్ళ ముందు నువ్వు లేవన్న నిజంకన్నా..కలల్లో నువ్వు కలుస్తావేమో అనే వూహెంతోబావుంది ..
మస్తిష్కంలో ఇవ్వాళా నువ్వు కనపడలేదన్న వ్యధ కన్నా..
నాలుగు గోడల మధ్య నిషి   గుండెల్లో తల దాచుకుంటే ప్రశాంతం గా వుంది..
నువ్వు పక్కనలేవన్న నిట్టూర్పుకన్నా..
చీకటి చేతిలో చెయ్యేసి కూర్చుంటే హాయిగా వుంది..
కృష్ణా నిశి రాత్రి నిండు వెన్నెల పూయించ నడిచిరావ..కనీసం సందేశం పంపవా..
అంతరాత్మ చెప్పిందన్న ఆత్మవంచన ఎన్నాళ్ళు..
అందమైన అబద్ధాన్ని మోసుడు ఇంకెన్నాళ్లు..
అందమైన హరివిల్లును ముక్కలు చెయ్యాలన్న ఆలోచన ఎందుకు..
దరి చేరే సుగంధమాలను  కాలదన్ని  భాధపడ్డం ఎందుకు..
ముందరికాళ్ళ ప్రతిబంధకాల ముడులు విప్పితే..ఆనందలోక ద్వారం..అదెంత దూరం..
Oh My..
The vibrant glimpse of you disturbs my determination..
Violently you took away peace even from my imagination..
That sparkling smile is contagious and left me in your persuasion..
On all my thoughts, you gained possession..
Taking from me all except path of salvation...
Why should not we sit and clear the equation... Oh my dear friend...