Thursday, March 28, 2019

Oh my chum..., I know, A day will come..
When , you will come..
Let, what may come..
Your absence makes my thoughts  set aflame..
Awaiting you,making me a candelabrum..
Count me for Any inhibitions to overcome..
Join me, before your image in my brain needs an exhume..
Your fragrance makes my heart chime..
Your company pumps my
Oxytocin enzyme..
అలిసిపోయేంత దూరం ప్రయాణం చేసినా..అడుగు మాత్రమైనా దూరమవ్వలేదంది మనసు..
కలిసినంత సేపు మోము తిప్పుకున్నా..కనుచూపుమేర దాటలేదంది మనసు..
మౌన బాష్యాల కావ్యాలు మదిలో ఎన్ని వ్రాసిన..మాట పెదవి దాటలేదంది మనసు..
నీ సందేశాల జడివానలో ఒకనాడు తడిసినా..కన్నీరు కార్చేందుకు చుక్క నీరులేక బీడుబారానంది మనసు..
చీకటి నా నేస్తం ఐయ్యిందా ...నీ నవ్వే చిరుదీపం అవుతుందా...
అమావాస్య పక్షమంత పరుచుకుందా.. నువ్వెంటవస్తే వెన్నెల ఉదయిస్తుందా...
నీ బంధాలన్ని తెంచుకోమనలేదు...నాతో అనుబంధం పంచుకోమన్నాను..
బంధాలను పసిపాపలా పదిలంగా చూసుకోగల చేతులు..
నువ్వు కనిపిస్తే సంతోషపడే నా పసి హృదయాన్ని ఎందుకు నలిపేస్తావు..
కళ్ళ ముందు నువ్వు లేవన్న నిజంకన్నా..కలల్లో నువ్వు కలుస్తావేమో అనే వూహెంతోబావుంది ..
మస్తిష్కంలో ఇవ్వాళా నువ్వు కనపడలేదన్న వ్యధ కన్నా..
నాలుగు గోడల మధ్య నిషి   గుండెల్లో తల దాచుకుంటే ప్రశాంతం గా వుంది..
నువ్వు పక్కనలేవన్న నిట్టూర్పుకన్నా..
చీకటి చేతిలో చెయ్యేసి కూర్చుంటే హాయిగా వుంది..
కృష్ణా నిశి రాత్రి నిండు వెన్నెల పూయించ నడిచిరావ..కనీసం సందేశం పంపవా..
అంతరాత్మ చెప్పిందన్న ఆత్మవంచన ఎన్నాళ్ళు..
అందమైన అబద్ధాన్ని మోసుడు ఇంకెన్నాళ్లు..
అందమైన హరివిల్లును ముక్కలు చెయ్యాలన్న ఆలోచన ఎందుకు..
దరి చేరే సుగంధమాలను  కాలదన్ని  భాధపడ్డం ఎందుకు..
ముందరికాళ్ళ ప్రతిబంధకాల ముడులు విప్పితే..ఆనందలోక ద్వారం..అదెంత దూరం..
Oh My..
The vibrant glimpse of you disturbs my determination..
Violently you took away peace even from my imagination..
That sparkling smile is contagious and left me in your persuasion..
On all my thoughts, you gained possession..
Taking from me all except path of salvation...
Why should not we sit and clear the equation... Oh my dear friend...
Energy drained in the thought of thee...
Thought , one day,it would be we not just me...
You, manifestation for my thought of she..
Releasing the stress of mind, y don't you just flee  .
.....ఎడారిలో ఒయాసిస్సు కనిపించింది ..అయినా ఎంలాభం ప్రయాణంలో తొడురాదుకా..మార్చ్ లో మల్లెలు పరిమలించాయి..అయినా ఎం లాభం తెల్లవారితే వాడిపోతాయికా..జీవితంలో ఎన్నో పరిచయాలు..అయినా ఎం లాభం...ఆఖరి ప్రయాణం ఒంటరిగానేకా..
ఏ చిత్రమాలిక నా మనసుకు అద్దం పట్టేలా లేదు నేడు..
ఎందుకో మధికి ఈ మూగవేదన..
మరల మరల నిన్ను కలవాలనే తపనతో నరకయాతన..
కృష్ణ ఇంకా ఎందుకు పరిక్షిస్తావు..ఇంకెన్నడు కనికరిస్తావు..
నీ పెదాలపై చిద్విలాసం నాకొసమనుకున్నా..నీ అర్ధనిమిలిత నేత్రాలలో తన్మయత్వం నన్ను చూసే అనుకున్నా..మా వెన్ను చూసుకోలేని మేము నిన్ను చూడగలమని ఎలా అనుకున్నావు..తోటి వాడి మనసునర్ధం చేసుకోలేని మేము..నీ లయతత్వాన్ని అర్థంచేసుకోగలమని ఎలా అనుకున్నావు..నీ చిద్విలాసం, తన్మయత్వం..నాలోని నిన్ను చూసుకొనే అని అర్ధమయ్యేసరికి..నన్ను నేను నీ దరికి తెచ్చుకోలేని బలహీనుడినయ్యాను..శివుడాజ్ఞ లేనిదే చీమయిన కుట్టదే...మరి నేను పాపినేలాఅయ్యాను..
చెప్పు శివయ్యా..
ముష్కరుల దాడికి అశువులుబాసిన నా వీర పుత్రులారా..
దేశ విచ్చిన్నం కాకుండా కాపాడాలి అన్న తాపాత్రయంలో అయ్యో మీ దేహాలు విచ్చిన్నమయ్యాయే..
కన్న తల్లికి కడుపుకోత ...పుడనితల్లికి పుత్ర శోకం మిగిల్చారు ...
అర్ధాంగికి ఆశ్రుధారాల తోడు వదిలి..మీరు కన్నవారికి , తోటి వారికి దేశ రక్షణ బాధ్యత ఆస్తిగా వదిలి..
నన్ను చేరారా నా బంగారు తండ్రులారా..
ఎందరో పాపుల్ని కలుపుకున్న నేను మీ రాకతో మరొమాటు ప్రక్షాళన పొందుతాను..
మీరు కార్చిన ప్రతి రక్తపుబొట్టు స్ఫూర్తిగా ఇంకో  జవాను పుడతాడు..
ఇక్కడ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటా..
అక్కడ పంచభూతాలతో ప్రళయ రౌద్రం సృష్టిస్తా..
ఎంత దూరమెల్లగలవు నన్ను వదిలి..
ఎంత దూరమురికెను అల కడలి వదిలి..
ముత్యాలు రాల్చావ మూగనోము వదిలి..
నువ్వు పక్కనుంటే కాదా ఆ ప్రదేశం వసంత లోగిలి.
నువ్వు పైకి చెప్పకపోయినా నీ గుండెల్లో నేనెప్పుడూ వున్నాను..
నేను మరిచిపోకుండా నా ఆలోచనల్లో నువ్వు ఎప్పుడూ వున్నావు...
మొదలైనప్పుడు తెలువదు ఇంత లోతుగా వెళ్తుందని నీ చూపు..
ఇంత కష్టమయితే నీ ఆలోచనల నుంచి బయటకురావటం ఎలా చెప్పు.
నువ్వొస్తావనుకున్నా..మళ్ళీ పలుకరిస్తావనుకున్నా..
తొలిసంధ్య చీకట్లను చీల్చుకువచ్చే భానుడిలా చిరునవ్వుల కిరణాలు చిందిస్తావనుకున్నా..నిండు సముద్రమంత గంభీరంగా నువ్వుంటే నీ గుండె లోతు తెలిసేదెలా..నువ్వు పలకరించలేదని వదిలేసి నిను మరిచేదెలా..
సంకోచమెందుకు  బాల, మాట కలిసేవేల మూతిముడుపేల..
ఉబికివచ్చే అభిమానాన్ని అధిమిపట్టనేలా..అడుగు ఆగబోయి ముందుకు సాగానేల.
కవితలు కావవి ఏవో పిచ్చి గీతాలు..
ఎలాగూ మార్చలేము ఎవరి తలరాత లు..
ఎప్పటికి చెయ్యలేము మనసుకు మర్రమ్మత్తులు..
అర్థంకావెవ్వరికి కృష్ణుడి గమ్మత్తులు.
ఆత్రేయ అంతోడిని కాకపోయినా..
ఐదుగురు ఆత్మీయులను పోగేసుకునేలా..
అశువులుబాసే వేల అయ్యో అనే అభిమానులు  ఉంటే చాలని..
నా ఆసుకవిత చిన్న ఆస ...
కారణం ఏదైనా కళ్ళు కలిస్తే చాలు..
ముచ్చటెధైన మాట కలిపితే చాలు..
నువ్వొచ్చేళ్ళాక గమనిచ్చా..నిజమే వసంతం వచ్చింది..
అమావాస్య లో నడిచొచ్చినా, పున్నమి వెలుగుల మీద ఆశను తెచ్చింది..
మొఖం తిప్పుకోకు..నొసలు చిట్లించకు..
ప్రతి నిమిషం నిను గుర్తుచేసుకునే నెనున్నానని గమనించు..
నీ గుండెల్లో నాకై కొంత అభిమానముంచు..
కృష్ణా... అలుక మానవా...ఆదరించవా.
ఎంత దూరమవదామనుకుంటే అంతగా ఆకర్షించే  సంఘటనలు ..
ఎంత దగ్గరవదామనుకుంటే అంత దూరముంచుతావు..
నాకు అన్ని నువ్వే అన్న భ్రమ కలిపిస్తావు..
నీకు అసలు నా ఉనికే పట్టనట్టుంట్టావు..
చేసావు నన్ను నీ జగన్నాటకంలో పాత్రధారి..
కాదని నమ్ముతున్నాను నువ్వో కపటనాటక సూత్రధారి ...
ఏ పేరుతో పిలిచినా మోహన కృష్ణ , భార్గవ రామ..
నిను తలచక మనసును ఆపుట నా తరమా..
అటవీ సంపదని అడ్డంగా నరికి
తరతరాలకు సరిపడా సంపద పోగేస్తున్నావా..
అడవుల్లో మనిషివి
యుగాలు దాటినా మారని సాంఘీక మృగమా.
నా ఆశ్రుధారల నయనాలు నీకు ఆనందాన్నిస్తున్నాయా..
నా రూధిర ధారల హృదయం నీ గుండెను కదలించలేదా..
మనిషి గురించి ఏమీ మంచి ఆలోచించలేని అచేతన స్థితిలోకి నెట్టేసావు..
వసంతం వచ్చినా ఆనందాన్ని ఆస్వాదించలేని విషాదంలో వదిలేసావు..
సెలయేటిలో చేప పిల్ల లా తుళ్ళుతూ ముందు తిరిగావు...
ఏ జాలరిని చూసి జడిశావో..అందనంత లోతుకు వెళ్ళిపోయావు..
ఏ వేటగాడికి బయపడ్డావో..
తాబేలు తల దాచుకున్నట్టు...నా మీద అభిమానాన్ని  హృదయంలో అదిమిపెట్టావు..
బడబానలంలాంటి చిచ్చు నా గుండెల్లో రగిల్చావు..
నదీ గర్భమంత స్తబ్దత నా మనసుకు తెచ్చావు..
నిన్ను పూర్తిగా అర్థం చేసుకునేలోపు ..
సముద్రంలో మత్స్యకన్యలా మాయమవుతున్నావు..
బగవంతుడిచ్చిన విలువైన బహుమానంలా..
గోదావరి ఒడ్డున దొరికిన ఆల్చిప్పలా నాతో వుండిపోవా...
హరిదాసు కీర్తనల కమనీయ మేలుకొలుపుతో..
రామ లక్ష్మణ బసవన్న ల దండాలతో ప్రారంభ మయ్యే రోజు..పంట ఇంటికొచ్చే పర్వదినాన..
హిమగిరి లాంటి మనసు భోగి మంటల వేడికి కరిగి..
అభిమానం హిమనదిలా పొంగి..
ఉషోదయాన ఉప్పొంగే గోదారిలా ఉరకలెత్తి..
ఉత్తరాయణంలో నైనా నీ ఉత్తర ప్రత్యుత్తరాలు వుండాలని..
భార్గవ రాముడిలా కోపం ప్రదర్శించక..
కృష్ణ కమనీయ మోహన దరహసం పంచవా...
..భానుడు కూడ తన దిశను మార్చుకునే కాలం...నీ మనసు నా దిశగా పాయాణించాలని కోరుతున్నా....క్రిష్ణా
రేపు లేదన్నట్టుగా నీ తో మాట్లాడాలని వుంది..
నువ్వు కలవని నిన్నకు విలువలెనట్టనిపిస్తుంది..
మనం గడిపే క్షణాలే జీవితం లా నిలిచిపోవాలనుంది..
ఆశ అడిఆశాల ఊయలబయటికి వచ్చి స్థిరంగా నీతో వుండాలనుంది..కాలచక్రం గిర్రునతిరిగి మళ్ళ్లి మన పరిచయం మొదలైతే ఇంకొక్కసారి ఆస్వాదించాలనుంది..అన్ని ఒప్పులయితే చేజారకుండా పట్టుకోవలనుంది..తప్పులేవన్నవుంటే సరిదిద్దుకోవలనుంది..కృష్ణా ఇంకెన్నాళ్ళీ అలుక అని నిలదీయలనివుంది..
It's been a week..The bond getting weak...
Whatever did was just to tweak..was never intended to sneak..
You are still my goddess of Greek..Without you around, day is bleak..
sleepless remembering those beautiful cheek..Killing smile is what I seek...
Aur ek safar katham horaahahe..
Magar apne beech dhoor nahee..
Waqt badal rahaahey..
Jakmi dil ka dard nahee..
Ithna pachthaayega ek din sacha premi..
Mehsoos hoga aakh me aasu ki kami..
నా గుండె గుడి కాదు నీ మూర్తిని ప్రతిష్టించి బ్రతుకంతా పూజించటానికి..
నా గుండె ఉద్యానవనం కాదు...నీకు నచినప్పుడు వచ్చేల్లటానికి..
నా గుండె మాంసశాల కాదు..నీ మౌనం తో కయిమా కొట్టటానికి..
నా గుండె పురాతన వస్తుశాల కాదు..
నువ్వు విరిచిన మనసును బధ్రపర్చడానికి..
నా గుండె శవాగరం కాదు..నీ మీద చచ్చిపోయిన భావాలను భద్రపర్చడానికి..
అసలు నా గుండె నాది కాదు..నువ్వెప్పుడో దోచుకున్నావు కా..
ఊసులెన్నో చెపుతుంటే ఊర్వశిలా కనిపించావు..
ఉన్నట్టుండి కారణం చెప్ప కుండా మౌనాన్ని ఆశ్రయించావు..
ఊసరవెల్లి లా రంగు మార్చటం నీ తత్వం కాదు..
నీ తో మాట్లాడకుండా ఉండే ఒక్కరోజు కూడా నాకు లేదు..
భావాలు గుండెల్లో ఎన్నిరోజులు నొక్కిపెడతావు..
మౌనాస్త్రం తో నా హృదయాన్ని ఎన్ని సార్లు చేదిస్తావు...
బంధం ఏర్పర్చాక ప్రతిబంధకాలు గుర్తొచ్చాయా..
నీ ఆలోచనలు గుండె గాయాన్ని మాననిస్తాయా..
భాష కందని భావాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి..
నీ ఆలోచనలు నవనీతంలాంటి మనసును జల్లెడ పడుతున్నాయి.
కన్నీటి ధారలలో కాళరాత్రి కరిగిపోతుంది..
నీనుంచి జవాబు కై ఎదురుచూపుల్లో  ఇంకో రోజు గడిచిపోయింది..
యుగాలయిందా మనం కలిసి..నువ్వు మాట్లాడక పోతే యుగాంతమయినా ఎంపోతుంది..
మంచులా కరిగే కాలం- నీ మనసునేందుకు కరిగించలేకపోయింది..
సెలయేటి ధారలు కురిపిస్తోంది నా నయనం..
రైలు పట్టాల లా ఇంకెంత దూరం ఈ ప్రయాణం..
..
నా ఆలోచనల్లో నువ్వే..
కాని నీ ప్రపంచం లో నేను లేను  ..
నా ఉశ్వాస నిశ్వాసల్లో నీ తలపులే...కాని నీ రేయి పగలులో నాకు స్థానం లేదు...
నా ఆనంద విషాధాలకు కారణం నువ్వు..
కాని నేనొక్క న్ని ఉన్నానని మరిచావు నువ్వు..
కృష్ణా ఇంకెంతకాలం నాకీ సంఘర్షణ ...
నల్లని మబ్బులు నీ నగుమోము చూసి నిశ్చలమయి నిలిచాయి ..
పచ్చిక బయ్యళ్ళు నీ ముంగరుల విన్యాసానికి మురిసాయి..
చెట్టంత  అందం ముందర చిన్నమొక్కయింది  ఒంటరి చెట్టు..
పచ్చని కొమ్మలన్ని నీ లవణ్యం ముందర చిన్నపోయాయి..
ఇంత అవయవసౌష్టంగా  పుట్టనప్పుడు రాతిగా పుట్టటమే న్యాయమనుకుంది ఆ బండరాయి...ప్రకృతి సౌందర్యమంతా ఆరడుగుల చీరలో అందంగా బంధించిన జానతనానికి..
తాను పుట్టించిన రూపమేనా లేక రవివర్మ చిత్రమా అని బ్రహ్మే అబ్బురపడివుంటాడు...
నే చదవలేను నువ్వు చెరిపిన విషయం..నువ్వు చెరపలేవు నీ కళ్ళతో గుండెల్లోచేసిన గాయం..
నీకెందుకు గుర్తొచ్చానో నేను అర్థంచేసుకోలేను..నేనేందుకు మర్చిపోలేనో నువ్వర్ధం చేసుకోలేవు..
భాష వచ్చిఎంలాభం భావం పంచుకోలేకపోయాక....
ఎన్ని సార్లు అడిగి ఎలాభం మధురానుభూతులని మిగిల్చుకోలేకపోయాక..
రోజు కలసి ఎలాభం కలలు నిజంచేసుకోలేకపోతే..కలతలు సమసి ఎలాభం మనసు విప్పి మాట్లాడకపోతే...
ఎలా అర్ధం చేసుకోను నిన్ను..ఎలా సముదాయించుకో ను నన్ను...
నే చదవలేను నువ్వు చెరిపిన విషయం..నువ్వు చెరపలేవు నీ కళ్ళతో గుండెల్లోచేసిన గాయం..
నీకెందుకు గుర్తొచ్చానో నేను అర్థంచేసుకోలేను..నేనేందుకు మర్చిపోలేనో నువ్వర్ధం చేసుకోలేవు..
భాష వచ్చిఎంలాభం భావం పంచుకోలేకపోయాక....
ఎన్ని సార్లు అడిగి ఎలాభం మధురానుభూతులని మిగిల్చుకోలేకపోయాక..
రోజు కలసి ఎలాభం కలలు నిజంచేసుకోలేకపోతే..కలతలు సమసి ఎలాభం మనసు విప్పి మాట్లాడకపోతే...
ఎలా అర్ధం చేసుకోను నిన్ను..ఎలా సముదాయించుకో ను నన్ను...
దొంగ 'కృష్ణ'..దోబూచులాడుతున్నావా..అలుక తీర్చాలవద్దా అని ఆలోచిస్తున్నవా..
సందేహమెందుకు 'సెలయేరు'లా ని అనురాగాన్ని పంచటానికి..
వెణువు వెదురు ముక్కె కదా నీ పెదవి తాకే వరకు..
మోక్షం అందని ద్రాక్షే కదా నీ అభయం లేనంతవరకు..
ఎదురుగా వస్తే.. నిలదీయలనుంది..
పక్కగా వస్తే పట్టుకొని అడగాలనివుంది..
నను చూసి నవ్వినట్టేవుంది..
అస్సలేవరో తెలినట్టుంటావెందుకు..
ఎంతసేపు ఈ శోధన నాకు..
రోజు నీ గురించి ఆలోచనే..ఎప్పుడూ నిన్ను నిగ్గతీయలన్న తపనే..
బంధాలు లేకపోయినా బంధించిన భావమెందుకని...
ఎన్నో జీవరాశులున్నా కొందరిమీదే మమకారమెందుకు మాకు..
రాలిపోయే మట్టి ముద్దకే మెరుగులు దిద్దాలన్న కొరికలెందుకు ..
కాలిపోయే కట్టే తో వదిలిపోయే బంధాలకయి  ప్రతిదినం సంఘర్షణాలేందుకు..
పీపీలికాది బ్రహ్మాండం నువ్వే ఆంటివి.. సర్వాంతర్యామి ఇకనైనా కనుపడవేమి.. కృష్ణా పలుకవేమి..
కనులు తెరుద్దామంటే కలలో నీ రూపం మాయమవుతుంది .
పడుకుంటే నిజంగా నీతో మాట్లాడే అవకాశం చేజారుతుంది..
నువ్వు మౌనంగా ఉంటే నా మనసంతా ఏదో గడబిడ..
నువ్వు మాట్లాడితే -ఎప్పుడు ఆపుతావో అని గుండెల్లో ఒకటే దడ..
నీ పెదాల పై చిరునవ్వు మబ్బుల మధ్య మెరిసే హరివిల్లు..
పిచ్చుక లాంటి నా మనస్సుకు కాదా నీ గుండే  పొదరిల్లు..
మనసుకున్న ముసుగు తీసి ఆస్వాదించు నా స్నేహపు జల్లు.
I wish to make a confession..That, until now, you are my biggest obsession..Your smile is most effective than  anaesthesia ..It can also make anyone to come out of dementia..I can't do anymore feelings' suppression..Your thought of not talking, would make my planets  in retrograde motion..I knew, for long time i am in your observation..This is not just out of aggression..Nor it is result of any frustration..Take time to read my presentation..Extend your smile after making effective conclusion...
#lady luck will smile...Someday
కనులు తెరుద్దామంటే కలలో నీ రూపం మాయమవుతుంది .
పడుకుంటే నిజంగా నీతో మాట్లాడే అవకాశం చేజారుతుంది..
నువ్వు మౌనంగా ఉంటే నా మనసంతా ఏదో గడబిడ..
నువ్వు మాట్లాడితే -ఎప్పుడు ఆపుతావో అని గుండెల్లో దడ..
నీ పెదాల పై చిరునవ్వు మబ్బుల మధ్య మెరిసే హరివిల్లు..
పిచ్చుక లాంటి నా మనస్సుకు కాదా నీ గుండే  పొదరిల్లు..
ఎందుకు వ్రాస్తున్నానో తెలీదు..
ఎవరిని మురిపిస్తున్నానో తెలీదు..
వ్రాస్తే ఊహల్లో నాతో ఉన్నావన్న సంతృప్తి..
ఏదో పంచుకున్నానన్న తృప్తి..
అసలేలా వుంటావు నువ్వు..
ఉషోదయాన తుశార బిందువుల్తో తడిసిన తామరలానా..
ప్రాతః కాళ పూజతర్వాత నిరాజనపు వెలుగులాగానా..
పొద్దుగూకే వేళదాక శ్రమించే శ్రామికుడికి శక్తినిచ్చే మొదటి సంకటి ముద్ద రుచిలాగానా..
అలసిన శరీరానికి పునర్జీవాన్నిచ్చే చెట్టు నీడఅంత చల్లగానా..
గోధూళి వేల పెనిమిటి ఇంకా రాలేదని ఎదురుచూసే కొత్త పెళ్లికూతురి జడలో కనకాంబరమంత రమ్యంగానా...
నెలలు నిండని పసిగుడ్డు బోసి నవ్వులానా..
చీకటేల చింతలన్ని తీర్చే అమ్మ పొతిళ్ళ్లంత దైర్యంగానా..
నీ కొనగంటి చూపు తాకినా నే 'తత' వాద్యాల్లా ప్రకంపిస్తున్నా..
నీ గొంతు వింటే 'సుశిర' వాద్యాల విభావరి నా గుండెల్లో నడుస్తోంది..నీ కర స్పర్శకయి 'అవనద్ధ' వాద్యమవడానికి కూడా శరీరం ఒప్పుకుంటోంది . ..ఈ మనసెంత పిరికిది..'డమరుక' ధ్వనిలా వున్నా నీ కోపానికి..చిరు 'తాళా'లలా   నా స్వరం తగ్గించింది..మనసెంత పిచ్చిది ...ఈ 'ఘటముండే వరకు మన గొంతులు 'తుతా'రులవ్వాలని కోరుకుంటోంది.. మనసెంత అమాయక మైనది..'సన్నాయి' లాంటి నీలో   ' షెహనాయి ' స్వరాలకు ఘులామ్ అయింది..మనసెంత వెర్రిది..తెగిన 'ఏక్తార ' తంత్రిలో తన్మయత్వాని కై వెదుకుతోంది..జుగల్బందీ వేలైయ్యింది జల్ది రా మిత్రమా ..
#musical instruments..
ఎదురుగా వస్తే.. నిలదీయలనుంది..
పక్కగా వస్తే పట్టుకొని అడగాలనివుంది..
నను చూసి నవ్వినట్టేవుంది..
అస్సలేవరో తెలినట్టుంటావెందుకు..
ఎంతసేపు ఈ శోధన నాకు..
రోజు నీ గురించి ఆలోచనే..ఎప్పుడూ నిన్ను నిగ్గతీయలన్న తపనే..
బంధాలు లేకపోయినా బంధించిన భావమెందుకని...
ఎన్నో జీవరాశులున్నా కొందరిమీదే మమకారమెందుకు మాకు..
పీపీలికాది బ్రహ్మాండం నువ్వే ఆంటివి.. సర్వాంతర్యామి ఇకనైనా కనుపడవేమి..
చంటి పాపలా నిద్ర పోయావా..
ఒంటరిగా నన్ను వదిలేసావ..
కల్మషం లేని ఆ సోగ కళ్ళు..
అయ్యాయో ఎన్ని కలలకు ఇళ్ళు..
పంజరం నుండి బయటపడ్డ పక్షిలా..నీ ఊహలు ఎన్ని తీరాలు తాకాయో..
నువ్వు కలకన్న ప్రతి తీరం నీ సొంతమవ్వాలి..
నా తో మనసు విప్పి మాట్లాడకపోయినా నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి..
ఎన్నో చెప్పాలని వున్నా ..నీ మౌనం బయపెడుతోంది..
నా మౌనం తో నీ మదిలో నా స్థానం బల పడితే ఎప్పటికి మూగిలా వుండాలనుంది.
.ఈ మూగనోమా నువ్వుకోరుకున్నది..దీనికేనా అన్ని ముచ్చట్లు చెప్పింది..
గుండెలోపలున్న నన్ను తరిచి చూడు..మనసు ముసుగు తీసి మాట్లాడి చూడు..
కాస్త సడలిస్తే నీ పంతం....నరకంలో నవనీతం దొరికినంత ఆనందం నీ సొంతం..
పావులు కదపటం, పాపుల్ని  చేసి ఆడుకోటం.వాడికి బాగా అలవాటు..
కొన్ని బంధాలు పెంచే ఎత్తులు..కొన్ని బంధాలు తుంచె కదలికలు..
అనుబంధం అనుకున్నాళ్ళు ఆనందం అందని ద్రాక్షే..
అనుబంధం లేదనుకుంటే ఆనందానికి అర్ధం అవసరం లేదు..
గాలి బుడుగ జీవితంలో గోడవలెందుకో,
జానెడు కడుపు నింపుకోటానికి అత్యాశలెందుకో .
బవబంధాల ప్రాకులాటలో జనులమధ్య అసూయవల్ల  ఏంలాభం..
పుట్టుకచావు చట్రం లో పురుషోత్తమున్ని కీర్తించని ఎన్ని జన్మలెత్తి ఎంలాభం..
ధ్యానం లో నువ్వు ఏకాగ్రతను సాధిస్తే..
నీ ధ్యానంలో నేను ఊసులన్ని పోగేస్తే..
పరధ్యానంలో రోజులెన్నో గడిపేస్తే..
ఉషోదయా లన్ని  ఊహలతో రెప్పలు బరువెక్కిస్తే..
మధ్యాన్నాలన్ని  మరుపురానివ్వక మెదడు పై దాడిచేస్తే..
సంధ్యాలన్ని కరిగే కాలాన్ని హెచ్చ్చరిస్తే..
చీకట్లన్నీ నిద్రని దూరం చేసి చికాకు చేస్తే..
ఎదుగుదలకు ఏది ఆస్కారం..చివరకు మిగిలేదేముంది తిరస్కారం..
పుష్పధన్వుడు పిల్లతెమ్మరల పిల్లనగ్రోవివూధగా..
సుధామషుడి చల్లని చూపులకి
కమలములు కన్నెలవ్వగా..ముద్దబంతులు ముద్దు గుమ్మలవ్వగా..సన్నజాజుల సోయగాలు సురాపానపు మత్తులివ్వగ..
చుక్కలరేడు చూపు మరల్చగా..
..కార్తీకపౌర్ణమి వెన్నెల దారి చూపగా ..తార లోకం తరలి వచ్చింది శశి వర్చస్సు పొగడగా..
మిల మిల మెరిసే తారలు..వేల వేల పోతున్నాయి...ఆ నేలారాజు తానొక్కడే నింగినేలాగా...
నిద్రకు మించిన వరేమేమున్నది నిను మరవటానికి..
మేలుకువకు మించిన శాపమేమి నిను స్మరించకుండుటకు
..మూసినా రెప్పలు ఎప్పటికి తెరవకుంటే బాగుండు..
పక్కన నువ్వున్నావన్న  మృగతృష్ణకి..
ఊసులెన్నో చెప్పి..ఊహలకు రెక్కలిచ్చి..ఊరుకుంటావా..     నీకిది తగునా కృష్ణా..
--రేపల్లె లో ఓ గోపిక..
ఎండమావుల వెనుక పరిగెత్తి అలిసిన నేను..
ఎడారిలో ఉన్నానని అర్ధం చేసుకున్నాను..
గుండెల్లో గూడు కట్టుకుని ఒంటరితనముంది...ఆది   పారే కన్నీటి 'సెలయెట్లో' తొడునెతుక్కుంది..
తేన తుట్టలాంటి ఆలోచనలను అంత పెద్ద కళ్ళతో కదిలించావు..
అయినా తప్పు నాదే అన్న పర్లేదు..

ఆశ్రువులతో అలికిన ఈ కళ్ళకు..
లోకంలో ఏ ఆకారం చూసిన వికారపు ఆలోచన రాదిపుడు..
నన్నొదిలి వేళ్ళకు ఓ నేస్తమా..
ఆ దేవుడిచ్చిన విలువైన బహుమానమా..

గురువు మనోవ్యధ

ఎవో ఏవో భాధలు బరించె నేటి గురువులు..
ఎన్నో ఎన్నో ఆంక్షలు సహించె మూగ ఉపాధ్యాయులు..
శిష్యకోటి, గురుకోటి వున్నా..గత కాల పాదపూజలే చాటుతున్నా..
ఎంతో ఎంతో నిరసన భరించే నేటి గురు'కులం'..
పరీక్షా ఫలితాలు వున్నా, పరిశోధనా పత్రాలు వున్నా..ఐన ఐనా భోధనలోకమే ఆనంతావమానపూరితం..
ఏఐసీటీఈ, యుజీసీ లున్నా..పి ఆర్ సీ లు ఎన్నున్నా..
అయినా అయినా జీతమే అనూన్య కల్పానామృతం..
తన గుండె బరువెక్కుతున్నా , మోయలేని భాధ్యతలున్నా..
రోజూ జ్ఞానం పంచే   నిస్వార్ధ గురు జాతికే 'చైతన్య' గీత అంకితం..
ఎరుపు నీ బుగ్గలకందం..తెలుపు నీ కళ్ళల్లో అందం..
ఎరుపు తెలుపుల కలయిక నీ మేనికే అందం..
నీ మేని సువాసన ఓ పరిమళ సుగంధం..
కెంపులకరువ్వివగా మిగిలిన ఎరుపు..చేస్తోంది నీ బుగ్గలను ఇంకా నునుపు..
కడిగిన నీ మోము ద్వారపు గడప పసుపు..
తడిచిన అందాల తమకపు బింకం..
నువ్వోపుకుంటే కడతాను జీవితాంతం నీ అందానికి సుంకం..
అన్ని రంగుల కలపోతా తెలుపు..
నీ మనసులో ఏముందో ఇకనైనా తెలుపు...