Monday, August 27, 2018

ఓ దారం..

ఒక స్నేహితుడు.. రాఖీ  ఏముంది ఒక దారం అన్నాడు...అప్పుడు రాయలనిపించింది...

రక్షా బంధం ఒక దారం...::
అవును రక్షా బంధం ఒక దారం..
దూరపు బంధాల బరువు మోసెటి దారం..
పంచుకున్న రక్తసంబందానికి ప్రతీక దారం..
పెళ్ళైన పడతుల పుట్టింటికి వారధి ఆ దారం..
తమ్ముడి చేయి పట్టి నడిపించిన అక్క ఆసరా ఆ దారం..
విశ్వాన్ని ఎదిరించి తనను కాపాడగల అన్న  ఉన్నాడుఅన్న విశ్వాసం ఆ దారం..
మానవ మనుగడకు ఆత్మీయతే ఆధారం..
అందుకే మనస్పూర్తిగా కట్టుకుందాం రక్షా బంధన దారం...

రక్షాబంధం


విశ్వబ్రాతృత్వానికి ప్రతీక ..
స్త్రీ జాతి పట్ల మన కర్తవ్యాన్ని స్ఫురింపచేసే   దిక్సూచిక..
తోబుట్టువుల ప్రేమకు నగారా..
ఉప్పొంగే అనురాగాల నయాగరా..
పంచుకోటం నేర్పింది ఆ దేవుడిచ్చిన బంధం..
బాధ్యతను గుర్తుచేస్తోంది ఈ రక్షాబంధం.....

Tuesday, August 21, 2018

Kerala Catastrophe ---Isn’t a Man Made Calamity??



Kerala suffers the worst flood devastation in the  decades passed and claimed more than 300 lives besides an estimated loss of 20K Crore property and thousands stranded . This was only next to the situation Kerala faced in 1924 where around 1000 people lost their lives. Complete infrastructure of major part of Kerala is now demolished by the incessant rains. There were many incidents of sever landslides, rivers bursting their banks  leading to floods in many villages.

                          Kerala is known for its tourist destination  and good part of the income Kerala receives is also from Tourism , amounting to  10% of GDP  of Kerala with more than 8K crore of foreign exchange . The High raised structures constructed to meet the business demands of Tourism without proper planning also has a profound impact on the scenario of floods. In order to provide attractive tourism , at many places the catchment areas have been encroached, the forest lands were occupied unauthorized by private parties. Its clearly reflects the irresponsible Environmental Policy of Govt. to just look at with open eyes as huge excavations were taking place in the God’s own place. Earlier there was a committee by name Gadgil’s committee which , more than a decade ago itself, warned Govt to control mining and quarrying in the high ecologically sensitive zones  of western ghats, where now the flood effect is high. It might be strange for readers to identify that Gadgil committee clearly indicated that failing to restrict stone quarrying  will make Kerala to suffer as what we witness now.Ecologists raise their voices against illegal excavations, sand mining in dry rivers, deforestation, encroachment of catchment areas.
                           
                              There were nearly 34 dams which reached their danger level of water  storage leaving authorities no chance but to raise the gates. This has further worsen the situation in downside . In total there are around 42 dams constructed on 44 rivers in kerala with maximum number of dams on Periyar river ,counting to 12. And alone in Pallakad district there are nearly 12 hydropower plants apart from 12 in idukki district. This huge level of dam construction and water resource management is also a challenging factor which adds to the calamities naturally happening.
                            One good thing amidst all these is the humanity part, everyone including common public , Govt ,Army,Navy and Air forces  reacted swiftly and immediately adhoc planning was done with proper meticulous operations that lead to control the causalities and rescue thousands stranded. From nook and corner of country people are pouring in their generosity to help the needy with food items, clothes and daily needs. Its nice to see the feeling of brotherhood in most adverse situations. Hope Kerala recovers soon.


రమణీయ ప్రకృతే రాక్షసవతారం ఎత్తి
కరాళనృత్యంతో కేరళను శాసించే
వందల్లో ప్రజలు విగతజీవులాయిరి
వేలకోట్ల ఆస్తి వరదపాలయ్యే..
పంచభూతాలే పంచప్రాణాలను పంచుకుని..
నాకన్నా గొప్పేవరన్న  నరుణ్ణి..
నాకు దిక్కెవరని అనిపించే..
బ్రహ్మపదార్ధం భరతం పడతానన్నవాడు ..
అల్పపీడనానినికే  అశువులుభాస్తున్నాడు..
కృత్రిమ మేధస్సు సహజ ప్రాణాన్ని కాపాడగలిగిందా..
పర్యావరణ సమతుల్యాన్ని విస్మరిస్తే చివరికి మిగిలేది కృత్రిమ మనుషులెగా..
గీతాతత్వం గుర్తుంచుకుందాం ..
మానవత్వం
మదిననింపుకుందాం..
చేయి చేయి కలుపుదాం ...కేరళను కాపాడుకుందాం.....

కృష్ణ చైతన్య నాగరాజు...
పంచ భూతాల్లో మమేకమైన మెరునగధీర..
ఉపాధ్యాయుడి ఇంట పుట్టిన భారత రత్న..
విరోధుల్ని స్నేహితులుగా మార్చుకోగల వాక్చాతుర్య..
స్వర్ణ చతుర్భుజ విధాత-- వాగ్ధేవి ఆశీస్సుల ప్రధాత ..
నదీ అనుసంధాన రూపకర్త--అచంచల బుద్ధికల మృదు వక్త..
హిందూ ధర్మ రక్షక-- లౌకిక భారత పరిరక్షక..
భారతావని కి  మానవీయ విలువల రాజకీయ దిశా నిర్దేశం చేసిన ఆదర్శ నేత..
ఏకీకృత పౌర విధాననికేయి నినదించి-
ఐరాస లో తీవ్రవాదాన్ని ప్రేరేపించే శక్తులను ఎండగట్టి..
సార్క్ దేశాల మనసు గెలిచి-
కొంత కాలంగా అనారోగ్యంతో మౌనం దాల్చి..
కర్మ యోగి వెంట జనులెప్పుడు ఉంటారని నిరూపించి..
మమ్ము విడిచి శాశ్వతంగా  వెళ్లినావ మార్గదర్శక....
...నీకిదే మా ఆశ్రుతంజాలి...---
Krishna. C. N.

Monday, August 20, 2018

మనిషనే సముద్ర గ్రంధానికి..
మనసనే నిగంటువులో..
భావోద్వేకాలనే అలలపుటలలో..
నీ ప్రేమ పర్యాయపదాలకై..
నా యీ వెతుకులాట...
నీ ఓర చూపుల గాలనికి గుండేళ్ళేన్ని చిక్కాయో..
నీలో లావణ్యానికి ఎన్ని కవి హృదయాలు స్పందించాయో..
సెలయేటి గలగలల నీ కాలి సవ్వడిలకు ఎన్ని హృదయాలు లయ తప్పయో..
నిన్ను చూసి ఎందరు పికాసోలు పుట్టారో..
నాజుకు  నెచ్చెలీ కావలి నీ జీవితం ఓ ఆనందాల లోగిలి...
ఊగే కొమ్మల రాగాల ముచ్చట్లు..
రాలే మంచు బిందువులను ఒడిసిపట్టాలనుకునే ఆకుల ఆరాటాలు..
చిటారు కొమ్మన చింతలేని కోయిలమ్మ..
నందివర్ధనపు నగీషీలు..సన్నజాజుల  మధురిమలు..
ప్రకృతి సోయగాల తీపి కబురులు..
మనం  పంచుకొని ఆనందం ద్విగ్విణీకృతం చేసుకుందాం..
త్వరగా రా మిత్రమా...

Hello.
.Dear Friends..
Greetings for the day...

This is a blog i created to share  my feelings, opinions, views with each one of you.
I strongly believe in something, that i remember as i read a few years ago , as what Abraham Lincoln said--" With all Love towards MY Democracy , I don't agree with what Majority people say"...Each one of us has a unique thought process and we may not match with other's , it doesn't mean, we should concede our thoughts , we need to check for like minded people with who we can team up and go ahead in life..
I hope , i will come across of a few like minded people through this blog and also i wish to correct myself, if any time, by knowingly or unknowingly my posts hurt someone's feelings and if the same are brought to my notice immediately.

The one quote i like most and try to follow as much as possible in life is the one by Benjamin Franklin::
 "If you would not like to be forgotten as soon as you are dead,
Either write things worth reading OR
Do things worth writing"

Happy Reading friends....
మాతృ దేవోభవ
పితృ దేవోభవ
ఆచార్య దేవోభవ
అతిధి దేవోభవ ......
అందరికి నమస్సుమాంజలి ...
నా మదిలో మెదిలే ఆలోచనలు మీతో పంచుకోటానికి నేను చేస్తున్న ఒక చిరు ప్రయత్నమిది ...
మనిషి ఒక సంఘ జీవి ...తన ఆలోచనలను ఇతరులతో పంచుకుంటేనే ఆ మనుగడకు అర్ధం, పరమార్ధం అని నా అభిప్రాయం ...అలా పంచుకోవాలనే ఈ వేదికను ఎంచుకున్నాను ...
ఏనాడైనా నా భావ వ్యక్తీకరణలో ..ఎవరినైనా ఇబ్బందిపెట్టినట్టు అనిపిస్తే , దయచేసి నేరుగా నాకు తెలియచేస్తే , నా తప్పుని సరిద్దిదుకోడానికి నేను సదా సంసిద్ధుణ్ణి...
మనం మన ఆలోచనలతో.. పనులతో.. అన్నిసార్ల .అందరిని సంతృప్తిపర్చలేక పోవచ్చు ..కానీ కొంతమందినైనా.. కొన్నిసార్లైనా సంతృప్తి పరిచే ఆలోచనలను సదా నాకు ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ...
 పలికెడిది భాగవతము ...పలికించువాడు రామభద్రుండు ...అనే అంత గొప్పగా ..ఎప్పుడు వ్రాయలేక పోయినా నా పరిధిలో ఈ బ్లాగ్ ద్వారా ఎంతో కొంత విజ్ఞానాన్ని , సాహిత్యాన్ని ,నా దృష్టిలోకి వచ్చే విషయాలమీద నా  అభిప్రాయాలను మీ తో పంచుకుంటాను ..... సదా మీ స్నేహ హస్తాన్ని అభిలషించే ...మీ ..  
                                                                                                 కృష్ణ చైతన్య నాగరాజు