Monday, August 27, 2018

ఓ దారం..

ఒక స్నేహితుడు.. రాఖీ  ఏముంది ఒక దారం అన్నాడు...అప్పుడు రాయలనిపించింది...

రక్షా బంధం ఒక దారం...::
అవును రక్షా బంధం ఒక దారం..
దూరపు బంధాల బరువు మోసెటి దారం..
పంచుకున్న రక్తసంబందానికి ప్రతీక దారం..
పెళ్ళైన పడతుల పుట్టింటికి వారధి ఆ దారం..
తమ్ముడి చేయి పట్టి నడిపించిన అక్క ఆసరా ఆ దారం..
విశ్వాన్ని ఎదిరించి తనను కాపాడగల అన్న  ఉన్నాడుఅన్న విశ్వాసం ఆ దారం..
మానవ మనుగడకు ఆత్మీయతే ఆధారం..
అందుకే మనస్పూర్తిగా కట్టుకుందాం రక్షా బంధన దారం...

No comments:

Post a Comment