రమణీయ ప్రకృతే రాక్షసవతారం ఎత్తి
కరాళనృత్యంతో కేరళను శాసించే
వందల్లో ప్రజలు విగతజీవులాయిరి
వేలకోట్ల ఆస్తి వరదపాలయ్యే..
పంచభూతాలే పంచప్రాణాలను పంచుకుని..
నాకన్నా గొప్పేవరన్న నరుణ్ణి..
నాకు దిక్కెవరని అనిపించే..
బ్రహ్మపదార్ధం భరతం పడతానన్నవాడు ..
అల్పపీడనానినికే అశువులుభాస్తున్నాడు..
కృత్రిమ మేధస్సు సహజ ప్రాణాన్ని కాపాడగలిగిందా..
పర్యావరణ సమతుల్యాన్ని విస్మరిస్తే చివరికి మిగిలేది కృత్రిమ మనుషులెగా..
గీతాతత్వం గుర్తుంచుకుందాం ..
మానవత్వం
మదిననింపుకుందాం..
చేయి చేయి కలుపుదాం ...కేరళను కాపాడుకుందాం.....
కృష్ణ చైతన్య నాగరాజు...
No comments:
Post a Comment