సెలయేటిలో చేప పిల్ల లా తుళ్ళుతూ ముందు తిరిగావు...
ఏ జాలరిని చూసి జడిశావో..అందనంత లోతుకు వెళ్ళిపోయావు..
ఏ వేటగాడికి బయపడ్డావో..
తాబేలు తల దాచుకున్నట్టు...నా మీద అభిమానాన్ని హృదయంలో అదిమిపెట్టావు..
బడబానలంలాంటి చిచ్చు నా గుండెల్లో రగిల్చావు..
నదీ గర్భమంత స్తబ్దత నా మనసుకు తెచ్చావు..
నిన్ను పూర్తిగా అర్థం చేసుకునేలోపు ..
సముద్రంలో మత్స్యకన్యలా మాయమవుతున్నావు..
బగవంతుడిచ్చిన విలువైన బహుమానంలా..
గోదావరి ఒడ్డున దొరికిన ఆల్చిప్పలా నాతో వుండిపోవా...

No comments:
Post a Comment