Thursday, March 28, 2019

నల్లని మబ్బులు నీ నగుమోము చూసి నిశ్చలమయి నిలిచాయి ..
పచ్చిక బయ్యళ్ళు నీ ముంగరుల విన్యాసానికి మురిసాయి..
చెట్టంత  అందం ముందర చిన్నమొక్కయింది  ఒంటరి చెట్టు..
పచ్చని కొమ్మలన్ని నీ లవణ్యం ముందర చిన్నపోయాయి..
ఇంత అవయవసౌష్టంగా  పుట్టనప్పుడు రాతిగా పుట్టటమే న్యాయమనుకుంది ఆ బండరాయి...ప్రకృతి సౌందర్యమంతా ఆరడుగుల చీరలో అందంగా బంధించిన జానతనానికి..
తాను పుట్టించిన రూపమేనా లేక రవివర్మ చిత్రమా అని బ్రహ్మే అబ్బురపడివుంటాడు...

No comments:

Post a Comment