Thursday, March 28, 2019

అటవీ సంపదని అడ్డంగా నరికి
తరతరాలకు సరిపడా సంపద పోగేస్తున్నావా..
అడవుల్లో మనిషివి
యుగాలు దాటినా మారని సాంఘీక మృగమా.
నా ఆశ్రుధారల నయనాలు నీకు ఆనందాన్నిస్తున్నాయా..
నా రూధిర ధారల హృదయం నీ గుండెను కదలించలేదా..
మనిషి గురించి ఏమీ మంచి ఆలోచించలేని అచేతన స్థితిలోకి నెట్టేసావు..
వసంతం వచ్చినా ఆనందాన్ని ఆస్వాదించలేని విషాదంలో వదిలేసావు..

No comments:

Post a Comment