నీ పెదాలపై చిద్విలాసం నాకొసమనుకున్నా..నీ అర్ధనిమిలిత నేత్రాలలో తన్మయత్వం నన్ను చూసే అనుకున్నా..మా వెన్ను చూసుకోలేని మేము నిన్ను చూడగలమని ఎలా అనుకున్నావు..తోటి వాడి మనసునర్ధం చేసుకోలేని మేము..నీ లయతత్వాన్ని అర్థంచేసుకోగలమని ఎలా అనుకున్నావు..నీ చిద్విలాసం, తన్మయత్వం..నాలోని నిన్ను చూసుకొనే అని అర్ధమయ్యేసరికి..నన్ను నేను నీ దరికి తెచ్చుకోలేని బలహీనుడినయ్యాను..శివుడాజ్ఞ లేనిదే చీమయిన కుట్టదే...మరి నేను పాపినేలాఅయ్యాను..
చెప్పు శివయ్యా..
చెప్పు శివయ్యా..
No comments:
Post a Comment